లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఆసక్తి కలిగించిన నియోజకవర్గాల్లో కోయంబత్తూరు ఒకటి. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి కుప్పుస్వామి అన్నామలై అక్కడినుంచి పోటీ చేసారు. డిఎంకెకు చెందిన గణపతి రాజ్‌కుమార్ చేతిలో లక్షకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే తమిళనాడులో బీజేపీ ఓట్‌షేర్‌ను 12శాతానికి పైగా తీసుకువెళ్ళిన ఘనత ఆయనదే. స్వయంగా ఆయనకు సుమారు 33శాతం ఓట్లు పడ్డాయి.
రాజకీయంగా తమకు వెన్నులో వణుకు పుట్టిస్తున్న అన్నామలై ఓటమితో డిఎంకె నేతలు సంబరాలు చేసుకున్నారు. అన్నామలై, ఆయన పార్టీ బిజెపి, ఆయన అనుసరించే సనాతన ధర్మం అంటే నరనరానా ద్వేషం పెంచుకున్న డిఎంకె నేతలు, కార్యకర్తలు అన్నామలై ఓటమిని తమదైన శైలిలో వేడుక చేసుకున్నారు. ఒక మేక మెడలో అన్నామలై ఫొటోను దండలా వేసి, నడిరోడ్డు మీద ఆ మేకను నరికి చంపేసారు.
జూన్ 4, ఎన్నికల ఫలితాల రోజు, ఆ రోజే అన్నామలై పుట్టినరోజు కూడా. అన్నామలై ఓటమితో డిఎంకె నేతల సంతోషానికి హద్దే లేకుండా పోయింది. ఆ రోజు చెన్నైలో డిఎంకె ప్రధాన కార్యాలయంలో మేక బిరియానీ చేసి పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులకు పంచాలని నిర్ణయించుకున్నారు. ఒక మేకకు అన్నామలై ఫొటో తగిలించి దాన్ని అడ్డంగా నరికి చంపి వండుకు తిన్నారు.
ఈ సందర్భంలో ‘మేక’ను ఉపయోగించడం వెనుక అవమానకరమైన అర్ధం ఉంది. పేద రైతు కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన అన్నామలైని అవమానించడానికి ఆయనను మేకతో పోల్చారు. గతంలో అన్నామలై మాట్లాడుతూ తన కుటుంబానికి కొన్ని మేకలు తప్ప మరే ఇతర ఆస్తులూ లేవని వెల్లడించారు. ఆ మేకలే తన కుటుంబానికి జీవనాధారమని చెప్పారు. అన్నామలై నేపథ్యాన్ని అపహాస్యం చేయడానికే డిఎంకె కార్యకర్తలు ఈ నీచమైన పనికి దిగజారారు.
అంతేకాదు, అన్నామలై కర్ణాటక సౌత్ బెంగళూరులో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా పనిచేసేటప్పుడు ఆయనకు ‘సింగం’ అన్న ఇమేజ్ ఉండేది. ఇప్పటికీ ఆయన అభిమానులు ఆయనను సింగం అని పిలుస్తుంటారు. దాన్ని అపహాస్యం చేస్తూ అన్నామలై సింహం కాదు, మేక అని అవమానించడానికే డిఎంకె మద్దతుదారులు ఈ పని చేసారు.
ఇస్లామిక్ తీవ్రవాదులు తమకు నచ్చని మాటలు మాట్లాడేవారి ‘శరీరాల నుంచి తలలు వేరు చేస్తామని’ (సర్ తన్ సే జుదా) హెచ్చరిస్తుంటారు. నూపుర్ శర్మ వివాదం జరిగినప్పుడు ముస్లిములు ఆ నినాదాన్ని ఎంత విచ్చలవిడిగా వాడారో అందరికీ తెలుసు. తమకు అడ్డువస్తున్న అన్నామలై తలని నరికేస్తామని ‘సర్ తన్ సే జుదా’ చేస్తామనీ డిఎంకె నాయకులు బహిరంగంగా ఈ ప్రదర్శనకు పాల్పడ్డారు.
గత ప్రభుత్వంపై ఉపముఖ్యమంత్రి డ్రగ్స్ వ్యాఖ్యల కలకలం