ప్రముఖ నటి, బీజేపీ మండి ఎంపీ కంగనా రనౌత్‌కు ఘోర అవమానం ఎదురైంది. చండీగఢ్ విమానాశ్రయంలో మహిళా సీఐఎస్ఎఫ్ జవాన్ కంగనా చెంప పగలకొట్టింది. రైతుల నుద్దేశించి గతంలో కంగనా చేసిన వ్యాఖ్యల విషయంలో వీరి మధ్య మాటల యుద్ధం జరిగినట్లు తెలుస్తోంది. తాజాగా కంగనాపై దాడి జరగడం చర్చకు దారితీసింది.
కంగనా చెంప పగలకొట్టిన సీఐఎస్ఎఫ్ మహిళా జవాన్‌పై విచారణకు ఆదేశించారు. చండీగడ్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన కంగనా దాదాపు 2 గంటల సేపు విమానాశ్రయంలోనే ఆగిపోయారు. మహిళా సీఐఎస్ఎఫ్ జవాన్‌పై చర్యలు తీసుకునే వరకు అక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదని కంగనా తేల్చి చెప్పడంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగి విచారణ ప్రారంభించారు.