కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం వస్తుందన్న సానుకూల సంకేతాలతో దేశీయ స్ఠాక్ సూచీలు రెండో రోజూ లాభాల్లో దూసుకెళ్లాయి. ఈ నెల 9వ తేదీన కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటుకు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు.దీంతో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్లు భారీగా కొనుగోళ్లకు దిగారు. ప్రారంభం నుంచే లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు రోజంతా లాభాల్లోనే కొనసాగాయి. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 692 పాయింట్ల లాభంతో 75074 వద్ద ముగిసింది. 201 పాయింట్ల లాభంతో నిఫ్టీ 22821 వద్ద క్లోజైంది.
సెన్సెక్స్ 30 ఇండెక్సులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎన్టీపీసీ, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ లాభాలార్జించాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, హిందుస్థాన్ యూనిలీవర్, నెస్లే ఇండియా, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టాలను చవిచూశాయి. ముడిచమురు ధరలు స్వల్పంగా తగ్గాయి. బ్యారెల్ 78.70 డాలర్లకు దిగివచ్చింది.