అరేబియా సముద్రంలోని మిగిలిన భాగాలు, కర్ణాటకలోని మిగిలిన భాగాలు, దక్షిణ మహారాష్ట్ర, తెలంగాణ, కోస్తాంధ్ర మరికొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతు పవనాలు మరింత ముందుకు సాగేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
రాయలసీమ పరిధిలో ఒక ఆవర్తనం, కోస్తా కర్ణాటక ప్రాంతంలో మరో ఆవర్తనం విస్తరించి ఉందని వివరించారు. దీంతో నేడు రేపు ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో వానలు పడనున్నాయి.
రేపు(శుక్రవారం) పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పరిధిలో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వానలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది.