బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ ఉపయోగించినట్లు పోలీసులు నిర్ధారించడంతో నటి హేమను మా సభ్యత్వం నుంచి తొలగించారు. తెలుగు చిత్ర నటీనటుల సంఘం మాలో నటి హేమకు ఇప్పటి వరకు సభ్యత్వం కొనసాగింది. ఆమె డ్రగ్స్ ఉపయోగించిందనే ఆధారాలున్నాయని బెంగళూరు పోలీసులు తేల్చి చెప్పడంతో మా ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే నటి హేమ రక్తనమూనాలు పరీక్షించగా పాజిటివ్ వచ్చింది.
నటి హేమలను బెంగళూరు కోర్టు ఆదేశాల మేరకు 14 రోజుల జుడీషియల్ రిమాండుకు తరలించారు. విజయవాడకు చెందిన బెట్టింగ్ వాసు ఆధ్వర్యంలో దాదాపు 200 పాల్గొన్న రేవ్ పార్టీలో 80 మంది డ్రగ్స్ ఉపయోగించారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు విచారణ వేగవంతం చేశారు.