ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని సెలవుపై వెళ్లాలని జీఏడీ ఆదేశించింది. దీంతో సాయంత్రం కొత్త సీఎస్ ను నియమించే అవకాశం ఉంది. జవహర్ రెడ్డి ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్నారు. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్ కూడా సెలవుపై వెళ్లారు. అనారోగ్య కారణాలతో ఆయన సెలవు పెట్టినట్లు సమాచారం.
వైసీపీ ఘోర ఓటమితో గత ప్రభుత్వంలో సలహాదారులుగా పనిచేసిన పలువురు రాజీనామాలు చేశారు. రాజీనామా చేయని వారిని తక్షణమే తొలగించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఏపీ అదనపు అడ్వోకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ యర్రంరెడ్డి నాగిరెడ్డి, అదనపు పీపీ దుష్యంత్ రెడ్డి రాజీనామా చేశారు. ప్రభుత్వసలహాదారు పదవికి సజ్జల రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు. మరికొంతమంది సలహాదారులు కూడా రాజీనామా బాటలో ఉన్నారు.