లోక్ సభకు కొత్తగా 280 మంది ఎంపీలు ఎన్నికయ్యారు. 2019లో ఆ సంఖ్య 267గా ఉంది. తాజా ఎన్నికల్లో గెలిచిన వారిలో 263 మంది గతంలోనూ ఎంపీలుగా చేశారు. పీఆర్ఎస్ లెజిస్టేటివ్ రీసర్చ్ సంస్థ ఈ సమాచారాన్ని వెల్లడించింది.
మళ్ళీ ఎన్నికైన ఎంపీల్లో 8 మంది తమ నియోజకవర్గాన్ని మార్చుకున్నట్లు తెలిపింది. ఒకరు మాత్రం రెండు నియోజకవర్గాల నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. 17వ లోక్సభలో ఓ పార్టీ తరపున లోక్ సభలో అడుగుపెట్టిన 9 మంది ఎంపీలు.. ఈసారి మరో పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు. 53 మంది మంత్రులు ఎన్నికల్లో పోటీ చేయగా, 35 మంది మాత్రమే నెగ్గారు. 18వ లోక్సభలో బీజేపీ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది.
బీజేపీ 240 సీట్లలో జయకేతనం ఎగురవేయగా కాంగ్రెస్ 99 స్థానాల్లో విజయం సాధించింది. సమాజ్వాదీ పార్టీ 37 సీట్లతో మూడవ స్థానంలో నిలిచింది. తృణమూల్ కాంగ్రెస్ కు29 సీట్లు రాగా డీఎంకే 22 స్థానాల్లో విజయం సాధించింది. 16 సీట్లతో ఐదో అతిపెద్ద పార్టీగా లోక్ సభలో టీడీపీ నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో జేడీయూ నిలవగా ఆ పార్టీకి 12 మంది సభ్యుల బలం ఉంది. టీడీపీ, జేడీయూలు ఎన్డీయేలో భాగస్వాములుగా ఉన్నాయి.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు