అక్రమ వీసాల కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం కుమారుడు, కార్తీ చిదంబరానికి బెయిల్ లభించింది. 2011లో 263 మంది చైనీయులకు వీసాల జారీలో మనీలాండరింగ్నకు పాల్పడ్డారని కార్తీ చిదంబరంపై కేసు నమోదైంది. పంజాబ్ రాష్ట్రంలో విద్యుత్ కేంద్రం ఏర్పటునకు చైనీయుల వీసా రీయూజ్ అప్రూవల్ కోసం రూ.50 లక్షలు లంచాలు తీసుకున్నారని కార్తీ చిదంబరం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఈ కేసులో ఈడీ మార్చిలోనే ఛార్జిషీట్ వేసింది. రౌస్ అవెన్యూ కోర్టు సమన్లు జారీ చేసింది. లక్ష విలువైన రెండు బాండ్లు సమర్పించి కార్తీ చిదంబరం బెయిల్ తీసుకునున్నారు.
దర్యాప్తు సంస్థకు సహకరించాలని కోర్టు ఆదేశించింది. విదేశాలకు వెళ్లే ముందు పూర్తి సమాచారం కోర్టుకు తెలపాలని కూడా కార్తీ చిదంబరానికి షరతులు విధించారు. విదేశాల్లో ఉన్నా దర్యాప్తు సంస్థ ఆదేశించిన 48 గంటల్లో హాజరు కావాలని కూడా కోర్టు షరతు విధించింది.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు