Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home రాజకీయం

మోదీ-బీజేపీ వ్యతిరేక ప్రచారానికి కోటానుకోట్లు వెచ్చించిన పాశ్చాత్య సంస్థలు

Phaneendra by Phaneendra
Jun 6, 2024, 12:38 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో భారత ఓటర్లను ప్రభావితం చేయడానికి కొన్ని పాశ్చాత్య సంస్థలు మిలియన్ల డాలర్లు వెచ్చించాయని ‘డిజిన్ఫో ల్యాబ్’ సంస్థ తాజా నివేదిక ఆరోపించింది. ‘అదృశ్య హస్తాలు: 2024 భారత ఎన్నికల్లో విదేశీ జోక్యం’ అన్న పేరుతో ఆ సంస్థ నివేదిక విడుదల చేసింది. అమెరికాకు చెందిన హెన్రీ లూస్ ఫౌండేషన్, జార్జి సోరోస్‌కు చెందిన ఓపెన్ సొసైటీ ఫౌండేషన్, ఫ్రాన్స్‌కు చెందిన క్రిస్టోఫ్ జాఫెర్లోట్ తదితర సంస్థలు భారత ఓటర్ల అభిప్రాయాన్ని ప్రభావితం చేసేందుకు కలసికట్టుగా, సమన్వయంతో ప్రయత్నాలు చేసాయని ఆరోపించింది.

అంతర్జాతీయ మీడియాలోని కొన్ని సంస్థలతో పాటు కొన్ని పాశ్చాత్య అధ్యయన సంస్థలు కలిసి పెద్దమొత్తంలో నిధులు సమకూర్చుకుని, భారతీయ ఓటర్ల నిర్ణయాలను ప్రభావితం చేయడానికి పనిచేసాయని డిజిన్ఫో ల్యాబ్ విడుదల చేసిన 85 పేజీల నివేదిక వెల్లడించింది. లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడానికి ఆరు నెలల ముందు నుంచీ భారతదేశపు వ్యవస్థల మీద తీవ్ర విమర్శలు, నరేంద్రమోదీ మానవహక్కులను హరించివేసాడంటూ ప్రచారమూ విపరీతంగా జరిగిన సంగతిని ఆ నివేదిక బైటపెట్టింది. డిజిన్ఫో ల్యాబ్ ప్రకటించిన నివేదికలోని కొన్ని అంశాలు ఇలా ఉన్నాయి….   

క్రిస్టోఫ్ జాఫెర్లోట్:

ఫ్రాన్స్‌కు చెందిన రాజకీయ శాస్త్రవేత్త, భారతదేశ వ్యవహారాల నిపుణుడిగా భావించే క్రిస్టోఫ్ జాఫెర్లోట్ భారత్‌కు వ్యతిరేకంగా విమర్శలను విస్తృతంగా ప్రచారం చేయడంలో ప్రముఖ పాత్ర పోషించాడు. పాశ్చాత్య మీడియా సంస్థల్లో ఆయన భారత్‌లోని ఎన్డీయే ప్రభుత్వానికి, నరేంద్రమోదీకి వ్యతిరేకంగా పుంఖానుపుంఖాలుగా వ్యాసాలు రాసాడు. ఫ్రెంచ్ దినపత్రిక ‘లె మొండే’లో ఏకంగా శీర్షికే నిర్వహించాడు. నిర్దుష్టమైన ఎజెండా కలిగిన ఆ రచనలు భారతీయ మీడియాలోనూ విస్తృతంగా ప్రచారమయ్యాయి.

భారతదేశంలో కులగణన జరగాలంటూ డిమాండ్ చేసిన వ్యక్తి జాఫెర్లోట్. అది భారత్‌లో చాలా ప్రభావం చూపింది. ఆ ఆలోచనను కాంగ్రెస్ తమ మ్యానిఫెస్టోలో సైతం చేర్చింది. భారతదేశంలో కులగణన చేపట్టాలని జాఫెర్టోట్ మొట్టమొదట 2021లో ఒక నివేదిక ప్రచురించాడు. ఆ తర్వాత భారతీయ మీడియాలో పుంఖానుపుంఖాలుగా వ్యాసాలు రాసాడు. వాటి ఆధారంగానే భారతీయ ప్రసార మాధ్యమాలు ఈ ఎన్నికల సీజన్లో కులగణన గురించి విపరీతంగా ప్రచారం జరిగింది.

భారతీయ జనతా పార్టీలో అగ్రకులాల ఆధిపత్యం పెరిగిపోయిందంటూ జాఫెర్లోట్ మరో తప్పుడు నెరేటివ్‌ను విపరీతంగా ప్రచారం చేసాడు. దేశంలోని పెద్దపెద్ద ప్రచురణ సంస్థలన్నీ ఆ కథనాలను విపరీతంగా ప్రచారం చేసాయి. ఆ సిద్ధాంతం ద్వారా సమాజంలోని వేర్వేరు వర్గాల మధ్య విభేదాలు సృష్టించాలన్న ఉద్దేశపూర్వక ప్రచారం జరిగింది.

 

హెన్రీ లూస్ ఫౌండేషన్:

జాఫెర్లోట్ వంటి సోకాల్డ్ విద్యావేత్తలకు ఆర్థిక సహాయం చేసింది అమెరికాకు చెందిన హెన్రీ లూస్ ఫౌండేషన్. హెన్రీ లూస్ అనే అమెరికన్ కుబేరుడికి చెందిన సంస్థ అది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ‘టైమ్’ పత్రిక వ్యవస్థాపకుల్లో హెన్రీ లూస్ ఒకరు. భారత సమాజం, భారత రాజకీయాలకు సంబంధించిన పలు ప్రాజెక్టులకు హెన్రీ లూస్ ఫౌండేషన్ భారీమొత్తంలో నిధులు సమకూర్చింది.

హెన్రీ లూస్ ఫౌండేషన్ (హెచ్‌ఎల్‌ఎఫ్) ఉద్యోగుల్లో అత్యధికులు అమెరికా ప్రభుత్వ మాజీ అధికారులు. ఆ సంస్థ మేధోవనరులుగా (థింక్‌ట్యాంక్‌) ఉన్నవారు అమెరికా ప్రభుత్వ వ్యవస్థతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నవారే. అలాంటి హెచ్ఎల్ఎఫ్ సంస్థ, భారతదేశానికి వ్యతిరేకంగా నిధులు సమకూర్చిన ప్రాజెక్టులలో ఒకటి ‘హిందూ ఆధిపత్య కాలంలో భారతదేశంలో ముస్లిముల పరిస్థితి’ అనేది. 2021 నుంచి 2024 వరకూ జాఫెర్లోట్ చేపట్టిన ఆ ప్రాజెక్టుకు హెచ్‌ఎల్‌ఎఫ్ 3,85,000 డాలర్ల నిధులు సమకూర్చింది.

హెచ్ఎల్ఎఫ్ సంస్థ మరిన్ని ప్రాజెక్టులకు కూడా నిధులు సమకూర్చింది. మచ్చుకు, జార్జిటౌన్ యూనివర్సిటీలోని బర్కిలీ సెంటర్ ఫర్ రెలిజియన్, పీస్ అండ్ వరల్డ్ అఫైర్స్ ఒక ప్రాజెక్టు చేపట్టింది. దానిపేరు ‘ది హిందూ రైట్ అండ్ ఇండియాస్ రెలిజియస్ డిప్లొమసీ’. అలాగే కార్నిగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ అనే సంస్థ హిందూ జాతీయవాదానికి, భారతదేశంలోని రెలిజియస్ డైనమిక్స్‌ను విమర్శిస్తూ పలు వ్యాసాలను ప్రచారం చేసే ప్రాజెక్టు చేపట్టింది. దానికి హెచ్ఎల్ఎఫ్ సంస్థ 120,000 డాలర్లు సమకూర్చింది. ఆ పరంపరలో ‘హిందూ జాతీయవాదం: జాతుల అస్తిత్వం నుంచి అధికార అణచివేత వరకూ’, ‘భారతదేశంలో మతం, పౌరసత్వం, ఉనికి’, ‘మతమే జాతీయత, భారత్‌లో పెరుగుతున్న హిందూ ఓటు’ వంటి వ్యాసాలు ప్రచురితమయ్యాయి.

హెన్రీ లూస్ ఫౌండేషన్, హ్యూమన్ రైట్స్ వాచ్ అనే సంస్థకు ఒక నిర్దిష్టమైన ప్రాజెక్టుకు 3లక్షల డాలర్లు సమకూర్చింది. ఆసియాలో – ప్రత్యేకించి భారత్, ఇండోనేషియా, మయన్మార్ దేశాల్లో మతహింసను రికార్డు చేయాలన్నదే ఆ ప్రాజెక్టు. అలాగే, అమెరికా కాలిఫోర్నియాలోని అంగనా ఛటర్జీ, రట్గర్స్ యూనివర్సిటీకి చెందిన ఆడ్రే ట్రష్క్ వంటి బీజేపీ వ్యతిరేక విద్యావేత్తలకు సైతం హెచ్ఎల్ఎఫ్ ప్రత్యక్షంగా నిధులు సమకూర్చింది.  

 

జార్జి సోరోస్:

భారతదేశం గురించి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురించి ప్రతికూల ప్రచారం చేయడంలో హంగేరియన్-అమెరికన్ కోటీశ్వరుడు జార్జి సోరోస్, అతని సంస్థ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ పాత్ర విశ్వవిఖ్యాతం. జాఫెర్లోట్‌తో పాటు కెనడాకు చెందిన భారత వ్యతిరేక యాక్టివిస్టు రికెన్ పటేల్‌కు కూడా సోరోస్ సంస్థ నిధులు సమకూర్చింది.

రికెన్ పటేల్‌కు చెందిన నమతి ఫౌండేషన్ 2016 నుంచి 2022 వరకూ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్‌ నుంచి మిలియన్ల కొద్దీ డాలర్లు స్వీకరించింది. 2023లో రికెన్ పటేల్ ‘ఫ్రెండ్స్ ఆఫ్ డెమొక్రసీ’ అనే గ్రూప్‌కు చైర్మన్ అయ్యాడు. అప్పుడు ఆ సంస్థకు కో-చైర్మన్ ఎవరంటే, జార్జి సోరోస్ కుమారుడు జొనాథన్ సోరోస్. ఆ గ్రూప్ ఏకైక లక్ష్యం ‘భారతదేశాన్ని రక్షించడానికి అధికార బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేయడం’. ఆ గ్రూప్‌, రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్ళు చేయడం వంటి అంశాల గురించి విచ్చలవిడిగా అబద్ధాలు ప్రచారం చేసింది.

రికెన్ పటేల్ సంస్థల ద్వారా జార్జి సోరోస్ సంస్థలు భారత్‌లోని కొన్ని సంస్థలకు నిధులు చేరవేసాయి. ఉదాహరణకు న్యూఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ పాలసీ రిసెర్చ్. నిజానికి సిపిఆర్‌ సంస్థకు విదేశీ నిధులు స్వీకరించే లైసెన్స్ 2020లో రద్దయిపోయింది. అయినప్పటికీ ఆ సంస్థకు మోదీ-బీజేపీ వ్యతిరేక ప్రచారానికి నిధులు అందాయి.

Tags: George SorosHenry Luce FoundationLok Sabha ElectionsNarendra ModiOSFSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు
general

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన
general

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ
general

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ

వైసీపీ నేత వల్లభనేని వంశీకి అస్వస్థత
general

వైసీపీ నేత వల్లభనేని వంశీకి అస్వస్థత

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.