టీ20 క్రికెట్ ప్రపంచకప్‌లో భారత్ బోణీ కొట్టింది. భారత ఆటగాళ్లు తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై 8 వికెట్ల తేడాతో మొదటి విజయం నమోదు చేశారు. హార్దిక్ పాండ్యా 3, బుమ్రా 2, అర్ష్‌దీప్ 2, సిరాజ్ 1 వికెట్ తీశారు. ఐర్లాండ్ జట్టు 16 ఓవర్లలో 96 పరుగులకే కుప్పకూలింది. ఐర్లాండ్ జట్టులో డెలాని 26 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
97 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన భారత జట్టులో రోహిత్ శర్మ 52, పంత్ 36 పరుగులు చేశారు. 12.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి భారత జట్టు ఐర్లాండ్‌పై విజయం సాధించింది. బౌలింగ్, బ్యాటింగ్‌లోనూ భారత జట్టు ఐర్లాండ్ ఆటగాళ్లను చిత్తు చేశారు.