ఆంధ్రప్రదేశ్ శాసనసభను రద్దు చేస్తూ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్టికల్ 174 ను అనుసరించి మంత్రివర్గం సిఫార్సు మేరకు శాసనసభను రద్దు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు.
ఎన్నికల్లో ఎన్డీయే భారీ విజయం సాధించిన నేపథ్యంలో గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ 135, జనసేన 21, భాజపా 8 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించాయి. వైసీపీ కేవలం 11 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో కొత్త ప్రభుత్వం ఏర్పడనుంది. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. జూన్ 9న ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.