2019లో సొంతంగా 303 స్థానాలు గెలుచుకున్న బీజేపీ ఈ దఫా 240 సీట్లలోనే విజయం సాధించింది. 2019లో బీజేపీ 37.3 శాతం ఓట్లు సంపాదించగా ఈ ఎన్నికల్లో 36.6 శాతానికి తగ్గింది. అంటే కేవలం 0.7 శాతం ఓట్లు తగ్గడంతో బీజేపీ 63 సీట్లు కోల్పోయింది.
కాంగ్రెస్ పార్టీ 2019లో 19.5 శాతం ఓట్లు సాధించగా ఈసారి 21.2 శాతానికి తన వాటాను పెంచుకుంది. 1.7 శాతం ఓట్లు పెరగడంతో ఏకంగా 52 నుంచి 99కు లోక్ సభ స్థానాలు పెరిగాయి.
తమిళనాడులో బీజేపీకి ఓటింగ్ షేర్ భారీగా పెరిగినప్పటికీ. కానీ ఒక్క స్థానంలోనూ విజయం సాధించలేకపోయింది. తమిళనాడులో గత ఎన్నికల్లో 3.2 శాతం ఉన్న బీజేపీ ఓటు షేర్ ఈసారి 11.2 శాతాని పెరిగింది. పంజాబ్‌లో దాదాపు రెట్టింపు అయింది. 18.6 శాతానికి పెరిగింది.
బీహార్‌లో బీజేపీ ఓట్ షేర్ 23.6 శాతం నుంచి 20.5 శాతానికి తగ్గడంతో ఐదు సీట్లు నష్టపోయింది. పశ్చిమ బెంగాల్‌లో 1.6 శాతం మాత్రమే ఓట్లు తగ్గినప్పటికీ ఆరు సీట్లు కోల్పోయింది. మహారాష్ట్రలో 1.4 ఓటింగ్ శాతం తగ్గడంతో బీజేపీ, 23 నుంచి 10 సీట్లకు పడిపోయింది.
మహారాష్ట్రలో కాంగ్రెస్ ఓట్ షేర్ 16.3 శాతం నుంచి 17.1 శాతానికి పెరిగింది. అయినా సీట్లు ఏకంగా 1 నుంచి 13కు చేరుకున్నాయి. ఉత్తర ప్రదేశ్‌లో కాంగ్రెస్ ఓట్ షేర్ 6.3 శాతం నుంచి 9.5 శాతానికి పెరగడంతో ఆరు సీట్లు దక్కాయి. ఇండీ కూటమికి బీజేపీకి సమానస్థాయిలో యూపీలో ఓట్ షేర్ దక్కింది.