ఆంధ్రప్రదేశ్ పరిధిలోని లోక్ సభ స్థానాల్లో ఎన్డీయే అభ్యర్థులు అదరగొట్టారు. మొత్తం 25 స్థానాలకు గాను టీడీపీ 16చోట్ల గెలవగా జనసేన పార్టీ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ విజయం సాధించింది. విశాఖ టీడీపీ అభ్యర్థి భరత్ 5లక్షలకు పైగా మెజార్టీతో గెలుపొందారు.
విశాఖపట్నంలో టీడీపీ అభ్యర్థి మతుకుమిల్లి భరత్, వైసీపీపా అభ్యర్థి బొత్స ఝాన్సీలక్ష్మిపై 5,04,247 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.గుంటూరులో టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ వైసీపీ అభ్యర్థి కిలారి వెంకట రోశయ్యపై 3,44,695 ఓట్ల మెజార్టీతో నెగ్గారు.
అమలాపురంలోనూ టీడీపీ హవా కొనసాగింది. టీడీపీ ననుంచి పోటీ చేసిన గంటి హరీష్, వైసీపీ అభ్యర్థి రాపాక వరప్రసాదరావుపై విజయం సాధించారు.
శ్రీకాకుళంలో టీడీపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు వైకాపా అభ్యర్థి పేరాడ తిలక్‌పై భారీ మెజారిటీతో గెలిచారు. విజయవాడలో టీడీపీ అభ్యర్థి కేశినేని చిన్ని తన సోదరుడు కేశినేని నాని(వైసీపీ)పై 2,82,085 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సొంతం చేసుకున్నారు.
నరసాపురంలో బీజేపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస వర్మ వైసీపీ అభ్యర్థి గూడూరి ఉమాబాలపై 2.76లక్షల ఓట్ల మెజార్టీ సాధించి లోక్ సభకు ఎన్నికయ్యారు.
నెల్లూరులో టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డిపై గెలిచారు. విజయనగరంలో టీడీపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు వైసీపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్‌పై దాదాపు 2.4లక్షల ఓట్ల తేడాతో నెగ్గారు.రాజమండ్రిలో బీజేపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి విజయం సాధించారు. వైసీపీ నుంచి పోటీ చేసిన గూడూరి శ్రీనివాసులుపై 2.31లక్షల ఓట్ల మెజార్టీ సాధించారు.
కాకినాడలో జనసేన అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ భారీ విజయంతో రికార్డు సృష్టించారు. వైసీపీ అభ్యర్థి చలమశెట్టి సునీల్‌పై 2,29,491 ఓట్ల మెజార్టీతో రికార్డు క్రియేట్ చేశారు.చిత్తూరులో టీడీపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు, వైసీపీ అభ్యర్థి ఎన్.రెడ్డప్పపై 2,20,479 ఓట్ల మెజార్టీతో గెలిచారు.
అనకాపల్లిలో బీజేపీ పాగా వేసింది. బీజేపీ అభ్యర్థి సీఎం రమేశ్ వైసీపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడుపై విజయం సాధించారు. బాపట్లలో టీడీపీ అభ్యర్థి టి.కృష్ణప్రసాద్ రెండు లక్షల ఓట్లకు పైగా మెజార్టీతో రికార్డు క్రియేట్ చేశారు.
మచిలీపట్నంలో జనసేన అభ్యర్థి వల్లభనేని బాలశౌరి,అనంతపురంలో టీడీపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ ఘన విజయాన్ని తమ ఖాతాల్లో వేసుకున్నారు.ఏలూరులో టీడీపీ అభ్యర్థి పుట్టా మహేశ్ యాదవ్, వైసీపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్‌పై 1,81,857 ఓట్ల తేడాతో గెలిచారు.
నరసరావుపేటలో టీడీపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీ అభ్యర్థి అనిల్‌కుమార్ యాదవ్‌పై నెగ్గారు. తిరుపతిలో వైసీపీ రెండోసారి విజయం సాధించింది. వైసీపీ అభ్యర్థి గురుమూర్తి భాజపా అభ్యర్థి వరప్రసాదరావుపై జయకేతనం ఎగురవేశారు.
నంద్యాలలో తెలుగుదేశం అభ్యర్థి భైరెడ్డి శబరి గెలుపొందారు.కర్నూలులో టీడీపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు, వైసీపీ అభ్యర్థి బీవై రామయ్యపై భారీ ఆధిక్యం సాధించారు.
హిందూపురంలో టీడపీ అభ్యర్థి బీకే పార్థసారథి గెలిచారు. కడపలో వైసీపీ అభ్యర్థి వైఎస్ అవినాశ్ రెడ్డి విజయం సాధించగా కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన షర్మిల మూడోస్థానానికి పరిమితం అయ్యారు. టీడీపీ అభ్యర్థి భూపేష్ సుబ్బరామిరెడ్డి రెండోస్థానం నిలిచారు.
రాజంపేటలో వైసీపీ అభ్యర్థి మిథున్ రెడ్డి బీజేపీ అభ్యర్థి కిరణ్‌కుమార్ రెడ్డిపై 76,071 ఓట్ల మెజార్టీ సాధించారు. అరకులో వైసీపీపా అభ్యర్థి తనూజారాణి, బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీతపై విజయం సాధించారు.ఒంగోలులో టీడీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి గెలిచారు.
సంక్షోభం నుంచి గట్టెక్కించండి : 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్‌తో సీఎం చంద్రబాబు భేటీ