ఆంధ్రప్రదేశ్ శాసనసభ-2024 పోరులో టీడీపీ అతిపెద్ద పార్టీ అవతరించింది. 144 స్థానాల్లో పోటీ చేసి 135 చోట్ల విజయం సాధించింది. జనసేన 21 చోట్ల, వైసీపీ 11 స్థానాల్లో గెలవగా, బీజేపీ 8 నియోజకవర్గాల్లో నెగ్గింది. 164 సీట్లతో కూటమి విజయం సాధించి అధికారపక్షంగా అవతరించింది. శాసనసభలో మ్యాజిక్ ఫిగర్ 88 కాగా టీడీపీకే సొంతంగా భారీ మెజారిటీ ఉంది.
కోస్తాంధ్రలో వైసీపీ ఖాతా తెరవలేకపోయింది. రాయలసీమలోనూ పట్టుకోల్పోయింది. 8 జిల్లాల్లో ఎన్డీయే క్లీన్ స్వీప్ చేసింది. శ్రీకాకుళం జిల్లాలో 10నియోజకవర్గాల్లో కూటమి గెలవగా, విజయనగరం జిల్లాలో 9, తూర్పుగోదావరి జిల్లాలో 19 చోట్ల, పశ్చిమగోదావరి జిల్లాలో 15 స్థానాల్లో కృష్ణా జిల్లాలో 16 చోట్ల, గుంటూరు జిల్లాలో 17 స్థానాల్లో కూటమి ప్రభంజనం సృష్టించింది. అనంతపురం జిల్లాలో 14, నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాల్లోనూ కూటమి అభ్యర్థులే గెలిచారు.