2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ , పులివెందుల అసెంబ్లీ స్థానంలో 61687 ఓట్లతో టీడీపీ అభ్యర్థి బీటెక్ రవిపై గెలిచారు. జగన్ కేబినెట్ లో మంత్రిగా పనిచేసిన వారిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 6095 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆయనకు మొత్తం 100793 ఓట్లు పోల్ అయ్యాయి. టీడీపీ అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డికి 94, 698 ఓట్లు పడ్డాయి. ఈ స్థానం నుంచి పోటీ చేసిన బీసీవై పార్టీ చీఫ్ బోడె రామచంద్ర యాదవ్ కు 4559ఓట్లు పోల్ అయ్యాయి.
తంబళ్ళపల్లె నియోజకవర్గంలో పి. ద్వారకానాథ్ రెడ్డి గెలవగా, ఆలూరులో బి. విరూపాక్ష 2831ఓట్లతోజయకేతనం ఎగురవేశారు. మంత్రాలయంలో వై బాలనాగిరెడ్డి 12805 ఓట్ల మెజారిటీతో , టీడీపీ అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డిపై విజయం సాధించారు. రాజంపేటలో ఆకేపాటి అమరనాథ్ రెడ్డి(వైసీపీ), సుగవాసి బాలసుబ్రమణ్యం(టీడీపీ)పై 7016ఓట్లతో గెలిచారు. బద్వేలులో దాసరి సుధ విజయం సాధించారు. ఆమెకు 90410 ఓట్లు పోల్ అవ్వగా, బీజేపీ అభ్యర్థి బొజ్జా రోషన్నకు 71843ఓట్లు పడ్డాయి. దీంతో 18567 ఓట్లతో వైసీపీ విజయంసాధించింది. ఈ స్థానంలో కాంగ్రెస్ కు 7366 ఓట్లు పోల్ అయ్యాయి.
దర్శిలో తొలిరౌండ్ నుంచిపోటీ పోటీగా జరిగిన్ బ్యాలెట్ ఫైట్ లో వైసీపీ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి నెగ్గారు. టీడీపీ నుంచి పోటీ చేసిన గొట్టిపాటి లక్ష్మీపై 2456 ఓట్ల తేడాతో గెలిచారు. ఈ స్థానంలో కాంగ్రెస్ కు 1985ఓట్లు పడ్డాయి.
యర్రగొండపాలెం(ఎస్సీ)నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ , సైకిల్ గుర్తుపై పోటీ చేసిన ఎరిక్షన్ భాబు గుడూరిపై 5200 ఓట్లతో విజయం సాధించారు. పాడేరులో విశ్వేశర రాజు(వైసీపీ) 19338 ఓట్ల తేడాతో గెలిచారు. టీడీపీ అభ్యర్థి గిడ్డి ఈశ్వరి రెండో స్థానంలో నిలవగా, స్వతంత్ర అభ్యర్థి వంతాల సుబ్బారావుకు 15935 ఓట్లు పడ్డాయి. 13566 ఓట్లతో కాంగ్రెస్ నాలుగో స్థానానికి పరిమితమైంది. అరకు లో బీజేపీ అభ్యర్థి రాజారావుపై వైసీపీ అభ్యర్థి రేగం మత్స్యలింగం 31877 ఓట్లతో నెగ్గారు.