2019 ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి ఒకే ఒక్క సీటు గెలుచుకుని, తర్వాత ఆ అభ్యర్ధిని కూడా కోల్పోయిన జనసేన పార్టీ 2024 ఎన్నికల్లో 21 సీట్లలో పోటీ చేసి అన్ని స్థానాల్లోనూ గెలుచుకుని రికార్డు సృష్టించింది. అలాగే పార్లమెంటుకు పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ విజయం సాధించింది.
మన్యం జిల్లా పాలకొండ (ఎస్టి) నియోజకవర్గంలో జనసేన అభ్యర్ధి నిమ్మక జయకృష్ణ వైఎస్ఆర్సిపి అభ్యర్ధి విశ్వసరాయి కళావతిపై 13,291 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
విజయనగరం జిల్లా నెల్లిమర్లలో లోకం నాగమాధవి వైసీపీ అభ్యర్ధి బడ్డుకొండ అప్పలనాయుడుపై 39,829 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
విశాఖపట్నం జిల్లా విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ వైఎస్ఆర్సిపి అభ్యర్ధి వాసుపల్లి గణేష్ కుమార్‌పై 64,594 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
అనకాపల్లి జిల్లా అనకాపల్లి నియోజకవర్గంలో కొణతాల రామకృష్ణ వైఎస్ఆర్సిపి అభ్యర్ధి మలసాల భరత్‌కుమార్‌పై 65,764 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
విశాఖపట్నం జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి అభ్యర్ధి అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ను జనసేన అభ్యర్ధి పంచకర్ల రమేష్ బాబు 81,870 ఓట్ల మెజారిటీతో ఓడించారు.
అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో సుందరపు విజయ్ కుమార్ వైసిపి అభ్యర్ధి యు.వి. రమణమూర్తి రాజుపై 48,956 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో జనసేన వ్యవస్థాపక అధ్యక్షుడు కొణిదెల పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్సిపి అభ్యర్ధి వంగా గీతపై 70,279 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
కాకినాడ జిల్లా కాకినాడ గ్రామీణ నియోజకవర్గంలో పంతం వెంకటేశ్వరరావు (నానాజీ) వైసీపీ అభ్యర్ధి కురసాల కన్నబాబును 72,040 ఓట్ల మెజారిటీతో ఓడించారు.
కోనసీమ జిల్లా రాజోలు (ఎస్సి) నియోజకవర్గంలో దేవ వరప్రసాద్ వైఎస్ఆర్సిపి అభ్యర్ధి గొల్లపల్లి సూర్యారావు మీద 39,011 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
కోనసీమ జిల్లా పి గన్నవరం (ఎస్సి) నియోజకవర్గంలో గిడ్డి సత్యనారాయణ వైఎస్ఆర్సిపి అభ్యర్ధి విప్పర్తి వేణుగోపాల్‌పై 33,367 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో బత్తుల బలరామకృష్ణ వైఎస్ఆర్సిపి అభ్యర్ధి జక్కంపూడి రాజాపై 34,049 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో కందుల దుర్గేష్ వైఎస్ఆర్సిపి అభ్యర్ధి జి శ్రీనివాసనాయుడుపై 33,304 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలో బొమ్మిడి నారాయణ నాయకర్ వైఎస్ఆర్సిపి అభ్యర్ధి ముదునూరి నాగరాజ వరప్రసాదరాజుపై 49,738 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం పులపర్తి రామాంజనేయులు వైఎస్ఆర్సిపి అభ్యర్ధి గ్రంధి శ్రీనివాస్ పై ఓట్ల మెజారిటీతో 66,974 విజయం సాధించారు.
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో బొలిశెట్టి శ్రీనివాస్ వైఎస్ఆర్సిపి అభ్యర్ధి కొట్టు సత్యనారాయణపై 62,492 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో పత్సమట్ల ధర్మరాజు వైఎస్ఆర్ సిపి అభ్యర్ధి పుప్పాల వాసుబాబు మీద 44,945 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
ఏలూరు జిల్లా పోలవరం (ఎస్టి) నియోజకవర్గంలో చిర్రి బాలరాజు వైఎస్ఆర్సిపి అభ్యర్ధి తెల్లం రాజ్యలక్ష్మి మీద 7,935 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
కృష్ణా జిల్లా అవనిగడ్డలో మండలి బుద్ధప్రసాద్ వైఎస్ఆర్సిపి అభ్యర్ధి సింహాద్రి రమేష్ బాబు మీద 46,434 ఓట్ల మెజారిటీతో గెలిచారు.
గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో నాదెండ్ల మనోహర్ వైఎస్ఆర్సిపి అభ్యర్ధి అన్నాబత్తుని శివకుమార్ మీద 48,112 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు (ఎస్సి)నియోజకవర్గంలో అరవ శ్రీధర్ వైఎస్ఆర్సిపి అభ్యర్ధి కొరముట్ల శ్రీనివాసులుపై 11,101 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
తిరుపతి జిల్లా తిరుపతి నియోజకవర్గంలో ఆరణి శ్రీనివాసులు భూమన అభినయ్ రెడ్డిని 61,956 ఓట్ల మెజారిటీతో ఓడించారు.
పార్లమెంటు విషయానికి వస్తే… కాకినాడ ఎంపీ స్థానంలో జనసేన అభ్యర్ధి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ సమీప వైఎస్ఆర్సిపి ప్రత్యర్ధి చలమలశెట్టి సునీల్ మీద 2,29,491 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. మచిలీపట్నం నియోజకవర్గంలో వల్లభనేని బాలశౌరి, వైసీపీ ప్రత్యర్ధి 2,23,179 ఓట్ల ఆధిక్యం సాధించారు.
2019లో గాజువాక, భీమవరం రెండు స్థానాల్లో పోటీ చేసి, రెండుచోట్లా ఓడిపోయిన పవన్ కళ్యాణ్… ఇప్పుడు తన పార్టీని పోటీ చేసిన అన్నిస్థానాల్లోనూ విజయం సాధించేలా చేసుకోగలిగారు. తన అభిమానులకు ‘ఖుషీ’ పంచారు.