ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన కూటమితో పొత్తు పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ శాసనసభ ఎన్నికలకు 10 స్థానాల్లోనూ, లోక్‌సభ ఎన్నికలకు 6 స్థానాల్లోనూ పోటీ చేసింది. వాటిలో 8 అసెంబ్లీ స్థానాల్లోనూ, 3 ఎంపీ సీట్లలోనూ విజయం సాధించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో బిజెపి అభ్యర్ధి నడుకుదిటి ఈశ్వరరావు వైఎస్ఆర్‌సిపి అభ్యర్ధి గొర్లె కిరణ్ కుమార్‌పై 28,247 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
విశాఖపట్నం జిల్లా విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్ధి పెన్మెత్స విష్ణుకుమార్‌రాజు వైసిపి అభ్యర్థి కమ్మిల కన్నపరాజు మీద 47,534 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.
తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో బీజేపీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్థి డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డిపై 20,850 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
ఏలూరు జిల్లా కైకలూరు స్థానంలో బీజేపీ అభ్యర్ధి కామినేని శ్రీనివాసరావు సమీప ప్రతర్ధి దూలం నాగేశ్వరరావుపై 44,735 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.
ఎన్‌టిఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వై సత్యనారాయణ (సుజనా) చౌదరి వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్ధి షేక్ ఆసిఫ్ మీద 47,032 ఓట్ల మెజారిటీతో గెలిచారు.
కర్నూలు జిల్లా ఆదోనిలో పీవీ పార్థసారధి వైఎస్ఆర్‌సిపి అభ్యర్ధి వై సాయిప్రసాద్‌రెడ్డి మీద 18,164 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.
శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో వై సత్యకుమార్ యాదవ్, వైసీపీ అభ్యర్ధి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మీద 2974 ఓట్ల మెజారిటీతో గెలిచారు.
వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో చడిపిరాల ఆదినారాయణరెడ్డి వైఎస్ఆర్‌సిపి ప్రత్యర్ధి ఎం సుధీర్ రెడ్డి మీద 17,191 ఓట్ల మెజారిటీతో గెలిచారు.
ఇక పార్లమెంటు సీట్ల విషయానికి వస్తే….
అనకాపల్లి ఎంపీ సీటులో సిఎం రమేష్ వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్ధి బూడి ముత్యాలనాయుడు మీద 2,96,530 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
రాజమండ్రిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి వైసీపీ ప్రత్యర్ధి డాక్టర్ గూడూరి శ్రీనివాసులు మీద 2,39,139 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.
నరసాపురంలో భూపతిరాజు శ్రీనివాసవర్మ వైఎస్ఆర్‌సిపి అభ్యర్ధి గూడూరి ఉమాబాలపై 2,76,802 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.