ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీయే కూటమి విజయంపై బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ పోటీ చేసిన దాదాపు అన్ని స్థానాల్లో విజయం దిశగా అభ్యర్థులు దూసుకెళుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. విజయవాడలో బీజేపీ ఆఫీసు ముదు బాణాసంచా పేల్చి సంబరాల్లో మునిగిపోయారు. నేతలు, కార్యకర్తలు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
బీజేపీ రాష్ట్ర ఎన్నికల సహా ఇన్చార్జి సిదార్థ్ నాథ్ సింగ్, 2024 విక్టరీ పేరు తో కేక్ కట్ చేసి సంబరాల్లో పాల్గొన్నారు. సిద్దార్థ్నాథ్ సింగ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలే ఆంధ్రప్రదేశ్ లో కూటమి విజయానికి దోహదపడ్డాయన్నారు.
కన్నడ ప్రజలు కూడా అభివృద్ధికి పట్టం కట్టారన్నారు. కన్నడ, తెలుగు ప్రజలు బీజేపీకి మద్దతు పలకడం మంచి పరిణామం అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా అభివృద్ధి పరుగులు పెడుతుంది న్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వేగవంతం చేస్తామన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రి గా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేస్తారు. రాష్ట్రంలో తెలుగు దేశం,జనసేన సంకల్ప పత్రం, జాతీయస్థాయిలో బీజేపీ మేనిఫెస్టో అమలు చేస్తామన్నారు.
సంబరాల్లో బీజేపీ ఉపాధ్యక్షుడు వేటుకూరి సూర్య నారాయణ రాజు, రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్రాశివన్నారాయణ, రాష్ట్ర మీడియా ఇంఛార్జి పాతూరి నాగభూషణం, ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురు పాటి కుమార స్వామి, మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ, రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామినీ శర్మ, బీజేపీ నేతలు కిలారు దిలీప్, వాసిరెడ్డి, సుబ్బయ్య, చైతన్య, మాదల రమేష్, పియూష్ పాల్గొన్నారు.