సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కేరళలో భారతీయ జనతా పార్టీ బోణీ కొట్టింది. కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీలు బలంగా ఉన్న కేరళలో బీజేపీ తొలి విజయం సాధించింది. కేరళలోని త్రిసూర్ లోక్సభ స్థానం నుంచి కమలం గుర్తుపై పోటీ చేసిన సురేశ్గోపీ విజయం సాధించారు.
సురేశ్ విజయంతో కేరళలో బీజేపీ ఖాతా తెరిచింది. సీపీఐ అభ్యర్థి సునీల్ కుమార్ పై 73 వేల ఓట్ల మెజారిటీతో సురేశ్ గోపీ విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మురళీధరన్ 3,24,431 ఓట్లతో మూడో స్థానానికి పరిమితమైంది. విజయం ఖాయం కావడంతో సురేశ్ గోపి అప్పుడే సంబరాల్లో మునిగిపోయారు. స్థానిక బీజేపీ శ్రేణులు, అభిమానులతో కలిసి చిందులు వేశారు.