నిషేధిత గ్లోబల్ టెర్రరిస్ట్ సంస్థ ISISకు చెందిన 17 మంది ఏజెంట్లపై NIA ఛార్జిషీట్లు దాఖలు చేసింది. విదేశీ హ్యాండర్లతో గ్లోబల్ లింకేజీని బహిర్గతం చేసిన కేసులో 2023 మార్చిలో ముగ్గురిపై ఛార్జిషీట్ దాఖలు చేసిన ఎన్ఐఏ సోమవారం దిల్లీ ప్రత్యేక కోర్టులో మరో 17మందిపై అనుబంధ ఛార్జిషీట్ వేసింది.
ఎన్ఐఏ చార్జిషీట్ వేసిన వారిలో 15మంది మహారాష్ట్రకు చెందిన వారు కాగా ఉత్తరాఖండ్, హరియాణా నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. కేసులో మొత్తం నిందితుల సంఖ్య 20కు చేరింది.
ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ రిక్రూట్మెంట్ దగ్గర శిక్షణ పొందుతూ వారి కుట్రల్లో భాగస్వాములు అవుతున్నారని ఎన్ఐఏ పేర్కొంది. అమాయక యువతను ట్రాప్ చేయడంతో పాటు అధునాతన పేలుడు పరికరాలు, ఐఎస్ఐఎస్ విధానాల పట్ల ఆకర్షితులయ్యేలా చేస్తున్నారని ఎన్ఐఏ పేర్కొంది.
ఇరాక్, సిరియా భావజాలం వ్యాప్తి చేస్తున్నారని పేర్కొంది. భారత్లో హింసను ప్రేరిపించి లౌకిక, ప్రజాస్వామ్య వ్యవస్థలను నాశనం చేసే ఐఎస్ఐఎస్ ఎజెండాలో భాగంగా వారు నిధులు సేకరిస్తున్నారని ఎన్ఐఏ చార్జిషీట్ లో వివరించింది.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు