ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం దిశగా పయనిస్తుండటంపై అభినందనలు తెలిపారు. ఇరువురికి శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, ఎన్డీయే విజయంపై హర్షం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కూటమి విజయం సాధించడంపై చంద్రబాబుకు ప్రధాని మోదీ, కేంద్రహోంమంత్రి అమిత్ షా అభినందనలు తెలిపారు. ఎన్నికల ఫలితాల్లో కూటమి అభ్యర్థులు భారీ ఆధిక్యంలో ఉన్నారు. మధ్యాహ్నం రెండుగంటల సమయానికి టీడీపీ 131 స్థానాల్లో లీడ్ లో ఉండగా, వైసీపీ 17 చోట్ల మాత్రమే ఆధిక్యంలో ఉంది. జనసేన 20 చోట్ల, బీజేపీ 7 చోట్ల గెలుపుదిశగా పయనిస్తున్నాయి.