ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ బోణీ కొట్టింది. అనపర్తి స్థానంలో బీజేపీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విజయం సాధించారు. టీడీపీ నేతగా ఉన్న నల్లమిల్లికి ఆ పార్టీ నుంచి టికెట్ దక్కకపోవడంతో ఆయన బీజేపీలో చేరి కమలం గుర్తుపై పోటీ చేసి గెలిచారు.
కూటమి అభ్యర్థిగా కమలం గుర్తుపై పోటీ చేసిన నల్లిమిల్లి రామకృష్ణా రెడ్డి, 17 వ రౌండ్ ముగిసే సరికి 20,567 ఓట్ల మెజిరిటీ సాధించారు. వైసీపీ అభ్యర్థి సత్తి సూర్యనారాయణ రెడ్డి 84138 ఓట్లు సాధించగా, రామకృష్ణా రెడ్డికి 104705 ఓట్లు సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి యల్లా శ్రీనివాసరావుకు 1276 ఓట్లు పడ్డాయి.
ఆస్తులన్నీ కాజేసిన అన్నగా జగన్ చరిత్రలో నిలిచిపోతారు : షర్మిల