ఇజ్రాయెల్ పౌరులను తమ దేశంలోకి అనుమతించ కూడదని మాల్దీవులు నిర్ణయం తీసుకునే దిశగా పావులు కదుపుతోన్న వేళ కీలక నిర్ణయం వెలువడింది. మాల్దీవుల కన్నా లక్షద్వీప్ ముద్దంటూ ఢిల్లీలోని ఇజ్రాయెల్ కాన్సులేట్ ప్రకటించింది. భారత్‌లో లక్షద్వీప్, గోవా, కొచ్చిన్, నికోబార్‌దీవుల ఫోటోలను ఇజ్రాయెల్ కాన్సులేట్ కమిషనర్ ఎక్స్‌లో ఫోటోలు పోస్ట్ చేశారు.
ఇజ్రాయెల్ పౌరులను తమ దేశంలోకి ప్రవేశించడాన్ని నిషేధించాలని మాల్దీవులు నిర్ణయించింది. ఏటా ఇజ్రాయెల్ నుంచి మాల్దీవులకు 15 వేల మంది పర్యాటకులు వస్తుంటారు. పలు దేశాల నుంచి మాల్దీవులకు ఏటా పది లక్షల మంది పర్యాటకులు సందర్శిస్తున్నారు. పాలస్తీనా, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో మాల్దీవులు ఈ నిర్ణయం తీసుకుంది.