సార్వత్రిక ఎన్నికల ఫలితాల తొలి 2 రౌండ్లు వెలువడ్డాయి. దేశ వ్యాప్తంగా బీజేపీ హవా కొనసాగుతోంది. 272 ఎంపీ స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. ఇండియా కూటమి 171 స్థానాల్లో ఆధిక్యత కనబరిచింది. ఇతరులు 51 స్థానాల్లో మెజారిటీలో కొనసాగుతున్నారు. దేశ వ్యాప్తంగా మోదీ హవా కొనసాగుతోంది. బీజేపీ ముందుగా లక్ష్యంగా పెట్టుకున్న సీట్లు రాకపోయినా మ్యాజిక్ ఫిగర్ దాటే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఏపీలో కూటమి గాలి వీస్తోంది. టీడీపీ 86, జనసేన 17, వైసీపీ 16, బీజేపీ 2 స్థానాల్లో ఆధిక్యత కనబరిచాయి. కూటమి అభ్యర్థులు తొలిరౌండ్లో భారీ మెజారిటీ దక్కించుకున్నారు. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలిరౌండ్లో 7 వేలకు పైగా మెజారిటీలో కొనసాగుతున్నారు. రాజమండ్రిలో టీడీపీ అభ్యర్థి బుచ్చయ్య చౌదరి 13 వేల మెజారిటీలో ఉన్నారు. కడపలో టీడీపీ అసెంబ్లీ అభ్యర్ధి మాధవీరెడ్డి 4 వేల ఓట్ల మెజారిటీలో ఉన్నారు. మంగళగిరిలో రెండో రౌండ్ ముగిసే సమయానికి టీడీపీ అభ్యర్థి నారా లోకేశ్ 12 వేలకుపైగా మెజారిటీలో ఉన్నారు.