మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ నంబూరు శేషగిరిరావు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్పై ఇవాళ విచారణ జరిగింది. పిన్నెల్లికి ఏపీ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ రద్దు చేయాలంటూ శేషగిరిరావు వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు సుదీర్ఘంగా విచారించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును తప్పుపట్టింది. కౌంటింగ్ సమయంలోనూ కేంద్రంలోకి వెళ్లవద్దని ఆదేశించింది.మాచర్ల నియోజకవర్గం పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే ఈవీఎం ధ్వంసం చేసిన వీడియోను న్యాయమూర్తులు పరిశీలించారు. ఇలాంటి అరాచకవాదికి బెయిల్ ఎలా ఇస్తారంటూ హైకోర్టు తీర్పును సర్వోన్నత న్యాయస్థానం తప్పుపట్టింది.
తనకు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నుంచి ప్రాణహాని ఉందంటూ శేషగిరిరావు వేసిన పిటిషన్పై జూన్ ఆరు తరవాత మరోసారి విచారణ జరపడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. మరోకేసులో చంద్రగిరి నియోజకవర్గంలో నాలుగు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించేలా సీఈసీని ఆదేశించాలంటూ వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు