బ్రహ్మోస్ క్షిపణి ప్రాజెక్టులో పనిచేసిన ఓ మాజీ ఇంజనీర్ నిశాంత్ అగర్వాల్ పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐకు సమాచారం లీక్ చేసిన కేసులో నాగపూర్ సెషన్స్ కోర్టు జీవితఖైదు విధించింది. నాగపూర్‌లోని కేంద్ర రక్షణశాఖకు చెందిన డిఫెన్స్ ఫ్యాక్టరీలో నిశాంత్ ఇంజనీరుగా పనిచేసిన కాలంలో కీలక సమాచారం పాక్ గూఢచార సంస్థకు అందించిన కేసులో భారత నిఘా వర్గాలు అరెస్ట్ చేశాయి.
నిశాంత్ అగర్వాల్‌పై అధికారిక రహస్యాల చట్టం ఉల్లంఘన కింద కేసు నమోదైంది. సెక్షన్ 235 కింద నేరం రుజువు కావడంతో నాగపూర్ సెషన్సు కోర్టు 14 సంవత్సరాల జీవితఖైదు, 3 వేల జరిమానా విధించింది. ఐటీ చట్టంలోని సెక్షన్ 66ఎఫ్ కింద నిశాంత్‌పై కేసు నమోదు చేశారు. ఆరేళ్లుగా విచారణ సాగింది. చివరకు డీఆర్డీఏ మాజీ ఇంజనీర్ నిశాంత్‌కు జీవితఖైదు విధించారు.