మద్యంతాగి లగ్జరీ కారును అత్యంత వేగంగా నడిపి ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ల మృతికి కారణమైన బాలుడి కేసు పలు మలుపులు తిరుగుతోంది. ప్రమాదం చేసిన బాలుడిని పోలీసులు ప్రశ్నించగా, అసలు నిజం చెప్పాడు. ఆ సమయంలో నేను తాగి ఉన్నానని, ఏమీ గుర్తు లేదని చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు. ప్రస్తుతం బాలుడు పుణెలోని జువైనల్ హోంలో ఉన్నాడు.
బాలుడు మద్యం సేవించలేదని తప్పుడు నివేదికలు ఇచ్చిన ఇద్దరు డాక్టర్లను ప్రభుత్వం సస్పెండ్ చేసి వారిని అరెస్ట్ చేసింది. బాలుడి రక్తం బదులు, అతని తల్లి రక్తం నమూనాలను తీసుకుని పరీక్షించారు. రిపోర్టు తారుమారు చేసేందుకు రూ.3 లక్షలు లంచం తీసుకుంటూ మధ్యవర్తిగా ఉన్న ప్యూన్ అడ్డంగా దొరికిపోయాడు. ఇప్పటికే బాలుడి కేసులో అతని తల్లి, తాత జైల్లో ఉన్నారు. బాలుడిని తప్పించే క్రమంలో తప్పుమీద తప్పులు చేస్తూ అడ్డంగా దొరికిపోవడంతో కేసు అనేక మలుపులు తిరిగింది.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు