లోక్‌సభ ఎన్నికలతో పాటు శాసనసభ ఎన్నికలు కూడా జరిగిన నాలుగు రాష్ట్రాల్లో సిక్కిం ఒకటి. ప్రేమ్‌సింగ్ తమాంగ్ నేతృత్వంలోని సిక్కిం క్రాంతికారీ మోర్చా రెండోసారి కూడా గెలిచి అధికారాన్ని నిలబెట్టుకుంది.
సిక్కిం శాసనసభలో 32 స్థానాలున్నాయి. వాటిలో 31 స్థానాల్లో సిక్కిం క్రాంతికారీ మోర్చా విజయాన్ని సాధించింది, అసెంబ్లీని క్లీన్‌స్వీప్ చేసేసింది. ప్రతిపక్ష సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ ఒక్క సీటుతో సరిపెట్టుకుంది. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ కనీసం ఒక్క సీటునైనా గెలుచుకోలేకపోయాయి.
ఎస్‌కెఎం పార్టీని ప్రేమ్‌సింగ్ తమాంగ్ విజయపథంలో నడిపారు. ప్రతిపక్ష ఎస్డిఎఫ్ అధ్యక్షుడు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పవన్‌కుమార్ చామ్లింగ్, తాను పోటీచేసిన రెండుచోట్లా ఓడిపోవడం గమనార్హం. ఇక బీజేపీ, కాంగ్రెస్ కనీసం ఖాతా తెరవలేకపోయాయి.
సిక్కిం క్రాంతికారీ మోర్చాను విజయపథంలో నడిపిన ప్రేమ్‌సింగ్ తమాంగ్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభినందించారు. రాష్ట్రాభివృద్ధి కోసం కలిసి పనిచేస్తామంటూ ట్వీట్ చేసారు.