నైరుతి రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించాయని అమరావతి వాతావరణ శాఖ ప్రకటించింది. ఇవాళ రాయలసీమలో రుతుపవనాలు ప్రవేశించినట్లు వెల్లడించారు. రుతుపవనాల ప్రభావంతో రాయలసీమతోపాటు కోస్తాలోనూ విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేశారు. అనంతపురంలో ఇప్పటికే 3 నుంచి 12 సెం.మీ వర్షపాతం నమోదైంది. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు అలుగు పారాయి.
కోస్తాలోనూ నైరుతి రుతుపవనాలు ప్రభావం చూసుతున్నాయి. గడచిన 24 గంటల్లో అల్లూరి జిల్లా, ఉభయగోదావరి, ఎన్టీఆర్ జిల్లాల్లో పలు చోట్ల 12 నుంచి 30 మి.మీ వర్షపాతం నమోదైంది. అంచనా వేసిన దాని కన్నా రుతుపవనాలు మూడు రోజులు ముందే రాష్ట్రంలోకి ప్రవేశించాయి. వీటి ప్రభావంతో రాబోయే మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం నమోదయ్యే అవకాశముందని ఐఎండి తెలిపింది.