సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ ఫోల్స్ కేంద్రంలో మరలా బీజేపీ ప్రభుత్వం వస్తోందనే రిపోర్టులు ఇవ్వడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు బుల్‌రన్ ప్రారంభించాయి. ఇవాళ ఉదయం ప్రారంభంలోనే సెన్సెక్స్ 1800 పాయింట్లు, నిఫ్టీ 500 పాయింట్ల లాభంతో మొదలయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందుతోన్న సానుకూల సంకేతాలు కూడా సూచీల దూకుడుకు కారణంగా అంచనా వేస్తున్నారు.
ఉదయం ప్రారంభంలో సెన్సెక్స్, నిఫ్టీ దూకుడు కనబరిచాయి.10 గంటల సమయానికి సెన్సెక్స్ 2000 పాయింట్లు పైగా లాభపడింది. సెన్సెక్స్ 2 వేల పాయింట్ల లాభంతో 77769 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 613 పాయింట్లు పెరిగి, 23144 వద్ద లావాదేవీలు జరుగుతున్నాయి. సెన్సెక్స్ 30 సూచీలో అన్నీ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ముడిచమురు ధర బ్యారెల్‌కు 83 రూపాయల వద్ద నిలకడగా కొనసాగుతోంది.