పాలస్తీనాకు క్రమంగా వివిధ దేశాల మద్దతు పెరుగుతోంది. తాజాగా ఇజ్రాయెల్ పౌరులను తమ దేశంలోని అనుమతించకూడదని మాల్దీవులు నిర్ణయించింది. ఆదివారం సమావేశమైన మాల్దీవుల మంత్రి మండలి దీనిపై చర్చించింది. ఇజ్రాయెల్ పాస్పోర్టు ఉన్న వారిని దేశంలోని అనుమతించకూడదని నిర్ణయించినట్లు ఆ దేశ హోం మంత్రి అలీ వెల్లడించారు. దీనికి సంబంధించిన చట్ట సవరణ త్వరలో చేయాలని మంత్రి మండలి నిర్ణయించింది.
మాల్దీవులకు ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి ఏటా 11 లక్షల మంది పర్యాటకులు వస్తుంటారు. ఇజ్రాయెల్ నుంచి ఏటా 15 వేల మంది మాల్దీవులు సందర్శిస్తున్నారు. మాల్దీవుల నిర్ణయంపై ఇజ్రాయెల్ స్పందించాల్సి ఉంది.