రేపటి నుంచి మూడు రోజుల పాటు ఏపీలో మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా అల్లర్లు చెలరేగే అవకాశ ముందన్న కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనా ఈ నిర్ణయం తీసుకున్నారు. 3,4,5 తేదీల్లో మద్యం దుకాణాలు మూతవేయనున్నారు. మరలా తిరిగి 6వ తేదీ దుకాణాలు తెరచుకుంటాయి.
మద్యం దుకాణాలు మూడు రోజులు మూత వేస్తున్నారనే విషయం తెలియడంతో మద్యం ప్రియలు షాపుల ముందు క్యూలు కట్టారు. మూడు రోజులకు సరిపడా సరకు నిల్వ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఏపీలోని పలు మద్యం దుకాణాల వద్ద తీవ్ర రద్దీ నెలకొంది.