విజయవాడలో ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ పై జరిగిన గులకరాయి దాడి కేసులో నిందితుడు వేముల సతీష్ జైలు నుంచి విడుదలయ్యారు. నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సతీష్‌కు న్యాయస్థానం షరతులతో కూడిన బైయిల్ మంజూరు చేసింది. రెండు రోజుల కిందటే సతీశ్ విడుదల కావాల్సి ఉన్నప్పటికీ ఈ రోజు జైలు నుంచి బయటకు వచ్చారు. నిందితుడు తల్లిదండ్రులు, డిఫెన్స్ లాయర్ అబ్దుల్ సలీంలు నెల్లూరు వచ్చి సతీష్ ను విజయవాడ తీసుకెళ్ళారు.
ఏప్రిల్ 13న ఎన్నికల ప్రచారంలో ఉన్న సీఎం జగన్‌పై గులకరాయ దాడి జరిగింది. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు సతీష్ నే దాడి చేసినట్లు నిర్ధారించి అరెస్టు చేశారు. బెయిల్‌పై బయటకు వచ్చిన సతీష్ ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నాడు. పోలీసులు రివాల్వర్‌తో తనను భయపెట్టారని సతీష్ ఆరోపించాడు.