ఆంధ్రప్రదేశ్ లో ఓట్ల లెక్కింపు ప్రక్రియపై ఎన్నికల ప్రధాన అదికారి ముఖేశ్ కుమార్ మీనా సమీక్ష నిర్వహించారు. జూన్ 4న కౌంటింగ్ సందర్భంగా సిబ్బందికి మార్గనిర్దేశం చేశారు. సచివాలయం నుంచి రిటర్నింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖేశ్ కుమార్, ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్, పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు, ఈవీఎంలలో పోలైన ఓట్ల లెక్కింపునకు అనుసరించాల్సిన అంశాలపై చర్చించారు.
రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడి, ఎన్‌కోర్‌లో ఫీడ్ చేయడం, అందుకు అవసరమైన ఐటీ వ్యవస్థ ఏర్పాటుపై అధికారులకు పలు సూచనలు చేశారు.
లెక్కింపు తర్వాత ఈవీఎంలను సీల్ చేసే విధానం గురించి చర్చించారు. ఈ నెల 8వ తేదీ లోపు నివేదించాల్సిన ఇండెక్స్ కార్డు గురించి కూడా సమీక్షలో ప్రస్తావించారు. మూడంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశించారు.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు