నేటి అర్ధరాత్రి నుంచి టోల్ చార్జీలు పెంచుతున్నట్లు జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ ప్రకటించింది. దేశవ్యాప్తంగా టోల్ ఛార్జీలను సగటున 5 శాతం పెంచుతున్నట్లు వెల్లడించింది.
ఛార్జీల పెంపు నిర్ణయం కొద్ది రోజుల కిందటే తీసుకున్నప్పటికీ ఎన్నికల కారణంగా వాయిదా వేసినట్లు వివరించింది. సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో నేటి(ఆదివారం) అర్ధరాత్రి నుంచి టోల్ ఛార్జీల పెంపు అమలు చేస్తామని పేర్కొంది.
ఏప్రిల్ 1 నుంచే టోల్ ఛార్జీలు పెంచాలని NHIA యోచించింది. ఈ నిర్ణయాన్ని కేంద్ర జాతీయ రహదారులు, రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లింది. ఎన్నికల నేపథ్యంలో ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వాయిదా వేయాలని ఈసీ తెలిపింది.