డ్రాగన్ కంట్రీ మరో ఘనత సాధించింది. చైనా చంద్రుడిపై ప్రయోగించిన లూనార్‌ల్యాండర్ చాంగే 6 విజయవంతమైంది. చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ చాంగే 6 విజయవంతమైనట్లు అధికారికంగా ప్రకటించింది. ఆదివారం ఉదయం అయిట్కిన్ ప్రాంతంలో చాంగే 6 సురక్షితంగా దిగినట్లు చైనా వెల్లడించింది. చైనా అంతరిక్ష ప్రయోగాల్లో ఇది మైలు రాయిగా నిలువనుంది.
చైనా అంతరిక్ష ప్రయోగాలకు ప్రయోగించిన చాంగే 6 అత్యాధునికమైనది. 2019లో చాంగే 4 చంద్రుడి అవతలివైపునకు ప్రయోగించింది. తాజాగా ప్రయోగించిన రాకెట్‌లో ఆర్బిటర్ ల్యాండర్ అసెండర్ రీఎంట్రీ మాడ్యూల్ పరికరాలున్నాయి. మే 3వ తేదీన చాంగే 6ను చైనా ప్రయోగించింది. ఆదివారం జులై 1న చంద్రుడిని చేరింది. రోబోల సాయంతో మట్టిని సేకరించనుంది. మట్టి తవ్వకానికి 14 గంటల సమయం పట్టనుంది.2030 నాటికి చంద్రుడిపైని శాస్త్రవేత్తలను పంపేందుకు చైనా ఈ ప్రయోగాలను చేపట్టింది.