వందలాది మందిపై లైంగికదాడి ఆరోపణలు ఎదుర్కొంటోన్న కర్ణాటక హసన్ జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ విచారణకు సహకరించడం లేదని పోలీసులు వెల్లడించారు. రేవణ్ణను కోర్టు ఆరు రోజుల కస్టడీకి అనుమతించిన సంగతి తెలిసిందే. నాకు సంబందం లేని కేసులో ఇరికించారని సమాధానం చెబుతున్నాడని పోలీసులు తెలిపారు. వీడియో చూపిస్తే ఆ వీడియోలో ఉన్న వారు నాకు తెలుసు కానీ అందులో ఉంది నేను కాదు. ఫేక్ వీడియోలు అంటూ చెబుతున్నాడని వారు మీడియాకు చెప్పారు.
రేవణ్ణకు ప్రశ్నిలు అడిగితే తన లాయర్ సమాధానం చెబుతాడంటూ దాట వేస్తున్నాడని సెట్ అధికారులు వెల్లడించారు. రేవణ్ణ కస్టడీ మరో రెండు రోజుల్లో ముగియనుంది. రేవణ్ణను విచారించేందుకు మరికొన్ని రోజులు కస్టడీ కోరే అవకాశ ముంది. రాత్రి 9 గంగల వరకు విచారణ కొనసాగింది. ఎంపీ రేవణ్ణ 10 గంటలకు నిద్రకు ఉపక్రమించాడని, ఉదయం 7 గంటల 30 నిమిషాలకు లేచారని పోలీసులు తెలిపారు.