ప్రకాశం జిల్లా ఒంగోలులో దారుణం చోటు చేసుకుంది. కన్నతండ్రే కుమారుడిని తుపాకీతో కాల్చి చంపాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. ఒంగోలు భాగ్యనగర్‌లోని ఈవీఎం గిడ్డంగి వద్ద రక్షణ బాధ్యతలు నిర్వహిస్తూన్న త్రిపురాంతకం గ్రామానికి చెందిన కె.ప్రసాద్ కన్న కొడుకు శశికుమార్‌పై కాల్పులు జరిపి ప్రాణాలు తీశాడు.
ఒకటో తేదీ రాత్రి పది గంటల సమయంలో ప్రసాద్ కుమారుడు శశికుమార్‌ను బైక్‌పై తీసుకుని ఈవీఎం గిడ్డంగి వద్ద డ్యూటీకి వచ్చాడు. ఈవీఎం గిడ్డంగుల వద్ద డ్యూటీలో ఉన్న వారిని తప్ప ఎవరినీ అనుమతించరు. కానీ కుమారుడిని తీసుకుని ప్రసాద్ విధులకు వచ్చాడు. ఒకటో తేదీ జీతం రావడంతో డబ్బు ఇవ్వాలంటూ శశికుమార్ అడిగినట్లు తెలుస్తోంది.ఆగ్రహానికి గురైన ఏఆర్ కానిస్టేబుల్ ప్రసాద్ తన వద్ద ఉన్న తుపాకీతో శశికుమార్‌ను కాల్చాడు. సమీపంలోని పోలీసులు శశికుమార్‌ను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు. కేసు నమోదు చేసి పోలీసులు విచారణ ప్రారంభించారు.