దిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు దిల్లీ కోర్టులో మరోసారి చుక్కెదురైంది. బెయిల్ కోరుతూ ఆయన దాఖలు చేసిన రెండు పిటిషన్లలో ఎలాంటి ఊరట దక్కలేదు.
ఎన్నికల ప్రచారం కోసం సుప్రీంకోర్టు కల్పించిన మధ్యంతర బెయిల్ కొనసాగించాలని, వైద్య పరీక్షల కోసం రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని కేజ్రీవాల్ పిటిషన్లు దాఖలు చేశారు.కేజ్రీవాల్ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై తీర్పును దిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు రిజర్వ్ చేసింది. ఈ నెల 5న కోర్టు నిర్ణయాన్ని ప్రకటించనుంది. దీంతో కేజ్రీవాల్ ఆదివారం తీహార్ జైలులో లొంగిపోనున్నారు. ఆ
దిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ విచారణలో భాగంగా మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా ఏప్రిల్ 1న తీహార్ జైలుకు తరలించారు. ఎన్నికల ప్రచారం కోసం బెయిల్ కోసం అభ్యర్థించగా కోర్టు అనుమతించింది.
ఇక మధ్యంతర బెయిల్ పొడిగించాలని.. అలాగే రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని ఇటీవల రౌస్ అవెన్యూ కోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ వేశారు. దీనికి ఈడీ అభ్యంతరం వ్యక్తం చేసింది. తాజాగా శనివారం మరోసారి విచారణ చేపట్టింది. విచారణను జూన్5కి వాయిదా వేసింది.