ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేపట్టిన 45గంటల ధ్యానదీక్ష ముగిసింది. చివరి దశ ఎన్నికల ప్రచారం ముగిసాక మోదీ తమిళనాడులోని కన్యాకుమారి వద్ద వివేకానంద స్మారక కేంద్రంలో ధ్యానదీక్ష తీసుకున్న సంగతి తెలిసిందే. అదిప్పుడు, ఆఖరి దశ పోలింగ్ ముగింపుతోపాటు పూర్తయింది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ కన్యాకుమారిలో ఆధ్యాత్మిక యాత్ర చేపట్టారు. వివేకానంద స్మారక కేంద్రంలోని ధ్యాన మండపంలో ధ్యానంలో ఉండిపోయారు. స్వామి వివేకానందకు భారతమాత దర్శనం కలిగిన ప్రదేశం అది.
మోదీ దీక్ష ను ప్రతిపక్షాలు తప్పుపట్టాయి. ఆయన ఆధ్యాత్మికంగా ధ్యానం చేయడం లేదని విమర్శించాయి. బిహార్‌కు చెందిన ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్, మోదీ కన్యాకుమారికి ఫొటోషూట్ కోసమే వెళ్ళారని వ్యాఖ్యానించారు. ‘‘మోదీ ఏ ధ్యానమూ చేయడం లేదు. ఫొటోలకు పోజులిస్తున్నారు. ఆ పని అయిపోగానే వెనక్కి వచ్చేస్తారు’’ అన్నారు తేజస్వి.
గురువారం సాయంత్రం ఎన్నికల ప్రచార సమయం ముగిసిన తర్వాత మోదీ కన్యాకుమారిలోని వివేకానంద స్మారక కేంద్రానికి చేరుకున్నారు. అక్కడే ధ్యానదీక్ష తీసుకున్నారు. శివభగవానుడి కోసం పార్వతీదేవి తపస్సు చేసిన ప్రదేశం అదేనని స్థానిక ఐతిహ్యం.
కన్యాకుమారికి మరో ప్రత్యేకత కూడా ఉంది. అది భారతదేశపు దక్షిణభాగాన చిట్టచివరి ప్రదేశం. తూర్పు, పశ్చిమ కోస్తాతీర ప్రాంతాలు కలిసే చోటు. హిందూమహాసముద్రం, బంగాళాఖాతం, అరేబియా సముద్రం సంగమించే స్థలం.
ఏడు దశల లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగసభలు, రోడ్‌షోలు అన్నీ కలిపి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75 రోజుల్లో 206 ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సుమారు 80 మీడియాసంస్థల ముఖాముఖీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత ఆధ్యాత్మిక ప్రయాణాలు చేయడం నరేంద్రమోదీకి ఎప్పటినుంచో ఉన్న అలవాటు. 2014లో శివాజీ ధ్యానం చేసిన ప్రతాప్‌గఢ్ కోటను సందర్శించారు. 2019లో కేదారనాథ్ సందర్శించారు. ఇప్పుడు 2024లో దక్షిణాగ్రాన ఉన్న కన్యాకుమారిలో ధ్యానం చేసారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు