మూఢం, శూన్య మాసం కారణంగా శుభకార్యాల సందడి ఎక్కడా కనిపించడంలేదు.. అయితే, ఈ నెలాఖరు నుంచి మళ్ళీ శుభముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు.
దీంతో తెలుగు రాష్ట్రాల్లో వివాహ, శంకుస్థాపన, గృహప్రవేశాల సందడి మొదలుకానుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 11 నుంచి ఏప్రిల్ 26 వరకు వివాహాలు, ఇతర శుభకార్యాలు జరిగాయి. ఆ తర్వాత మూఢం రావడంతో చాలామంది శుభకార్యాలను వాయిదా వేసుకున్నారు.
మాఘ, ఉత్తరఫాల్గుణి, హస్త, స్వాతి నక్షత్రాల వేళ శుభ ముహుర్తాలు ఉన్నాయని, వివాహాది శుభకార్యాలకు మంచి ముహూర్తాలని పండితులు చెప్పారు. ఈ ముహూర్తాలు దాటితే చాతుర్మాసం కారణంగా ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు మంచి ముహూర్తాలు లేవంటున్నారు. ఆ తర్వాత మళ్లీ డిసెంబర్ నెలలోనే శుభకార్యాలకు ముహూర్తాలు ఉన్నాయని పేర్కొన్నారు.
జూన్ 29 , జులై 9, జులై 11, జులై 12, జులై 13, జులై 14 , జులై 15న ముహూర్తాలు శుభకార్యాలకు సరిపోతాయని చెబుతున్నారు.