లోక్సభ ఎన్నికల విధుల్లో పాల్గొన్న 13 మంది సిబ్బంది మరణించారు. మరో 23 మంది అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు. అధిక ఎండలతో తీవ్ర జ్వరం, హై బీపీ వంటి కారణాలతో 13 మంది పోలింగ్ సిబ్బంది చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్లో ఈ విషాదం చోటుచేసుకుంది.
సోనభద్ర జిల్లాలో ఎన్నికల డ్యూటీలో పాల్గొన్న ఏడుగురు హోంగార్డులు, ముగ్గురు శానిటరీ కార్మికులు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ కార్యాలయంలో ఒక క్లర్క్, కన్సాలిడేషన్ ఆఫీసర్, ఒక ప్యూన్ ప్రాణాలు కోల్పోయారు.
ఎన్నికల విధులు నిర్వహిస్తూ అస్వస్థతకు గురైన 23 మంది మిర్జాపూర్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. వడదెబ్బతో ముగ్గురు చనిపోయినట్లు అధికారులలు వెల్లడించారు.