భారతదేశంలో జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలను ప్రభావితం చేయడానికి జరిగిన ఒక కోవర్ట్ ఆపరేషన్‌లో కృత్రిమ మేధను (ఎఐ) మోసపూరితంగా ఉపయోగించే ప్రయత్నాలను పసిగట్టి, కేవలం 24గంటల్లోనే వాటిపై తగిన చర్యలు తీసుకున్నట్లు ‘చాట్ జిపిటి’ సృష్టికర్త అయిన ‘ఓపెన్ ఏఐ’ వెల్లడించింది.
ఓటర్లపై ప్రభావం చూపే ఆ ప్రచారానికి ‘జీరో జెనో’ అని పేరు పెట్టారు. దాన్ని ఇజ్రాయెల్ దేశంలోని ‘స్టాయిక్’ అనే రాజకీయ ప్రచార నిర్వహణా సంస్థ ఆ కార్యక్రమాన్ని నిర్వహించింది.
ఓపెన్ ఎఐలోని శక్తివంతమైన లాంగ్వేజ్ మోడ్యూల్స్‌ను ఉపయోగించి వ్యాసాలు తయారుచేయడం, కామెంట్లు పెట్టడం, సోషల్ మీడియాలో ప్రొఫైల్స్ తయారుచేయడం వంటి పనులు చేసారని ఆ సంస్థ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ చెప్పారు. ‘‘భారతదేశంపై ప్రత్యేక శ్రద్ధ వహించి మే నెల నుంచి కామెంట్లను జనరేట్ చేయడం మొదలైంది. అధికాఐర బీజేపీని విమర్శించడం, ప్రతిపక్ష కాంగ్రెస్‌ను ప్రశంసించడం జరిగింది. భారత ఎన్నికలే లక్ష్యంగా జరిగిన కొన్ని చర్యలను, అవి మొదలైన 24 గంటల్లోగా నిలువరించాం’’ అని ఓపెన్ఏఐ చెప్పుకొచ్చింది.
సామాజిక మాధ్యమాలైన ఎక్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, వెబ్సైట్లలో కంటెంట్‌ను సృష్టించడం, ఎడిట్ చేయడం కోసం ప్రత్యేకంగా ఇజ్రాయెల్ నుంచి కొన్ని అకౌంట్లు పనిచేస్తున్నాయనీ, వాటిని నిషేధించామనీ ఓపెన్ ఏఐ వెల్లడించింది.
‘‘ఆ ఆపరేషన్ ఇంగ్లీష్, హీబ్రూ భాషల్లో కంటెంట్ తయారుచేసింది. దాని ద్వారా కెనడా, అమెరికా, ఇజ్రాయెల్ తదితర దేశాల ప్రజలను లక్ష్యం చేసుకుంది. మే నెల మొదట్లో అది ఇంగ్లిష్ కంటెంట్‌తో భారతీయ ప్రజలను లక్ష్యం చేసుకుంది’’ అని ఓపెన్ ఎఐ వివరించింది.
గత మూడు నెలల్లో భారతదేశంలోని నమూనాలను ఉపయోగించుకుని ఇంటర్నెట్ ద్వారా మోసం చేసే ప్రయత్నం చేసిన ఐదు కోవర్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఆపరేషన్స్‌ను అడ్డుకుని నిలువరించినట్లు ఓపెన్ ఏఐ వెల్లడించింది.
ఆ నివేదికకు స్పందిస్తూ బీజేపీ, అలాంటి చర్య ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని వ్యాఖ్యానించింది. ‘‘భారతదేశానికి చెందిన కొన్ని రాజకీయ పార్టీలు లేదా వాటి తరఫున బీజేపీని లక్ష్యం చేసుకుని విదేశీ శక్తుల ప్రమేయంతో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తిచేయడం గతంలోనూ జరిగింది, ఇప్పుడూ జరుగుతోందని… తాజా సమాచారంతో చాలా స్పష్టంగా వెల్లడైంది’’ అని ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు.
‘‘అది మన ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరమైన బెదిరింపు. దేశంలోనూ, దేశం వెలుపలా ఉన్న కొన్ని ప్రతీప శక్తులే ఈ చర్యల వెనుక ఉన్నాయని స్పష్టమవుతోంది. ఈ వ్యవహారాన్ని మరింత నిశితంగా దర్యాప్తు చేసి బైటపెట్టాలి. అయితే ఓపెన్ ఏఐ ఈ విషయాన్ని మరింత ముందుగా వెల్లడించి ఉండాల్సింది. ఎన్నికలు చివరి దశకు వచ్చేసిన ఈ సమయంలో చెప్పడం అంటే చాలా ఆలస్యమైంది’’ అని రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు