నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో వానలు పడుతున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి విశాఖపట్నం, కాకినాడ, శ్రీకాకుళం, కోనసీమ లో ఈదురుగాలులు వీస్తున్నాయి. రుతుపవనాల ప్రభావంతో రెండురోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వానలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
భారత ఈశాన్య ప్రాంతంలోకి రుతుపవనాలు ప్రవేశించాయి. సాధారణంగా జూన్ 1న కేరళను తాకి ఐదు రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ, మిజోరాం, మణిపుర్, అసోంకు చేరుకుంటాయి. అయితే ఈ దఫా రుతుపవనాలు దేశంలోకి చొరబడే సమయంలో బంగాళాఖాతంలో రేమాల్ తుఫాన్ ఏర్పడింది. దీని ప్రభావంతో నిర్ణీయ సమయానికి ముందుగానే ఈశాన్య రాష్ట్రాలకు చేరాయి.
2017లో కూడా ఇదే తరహా ఘటన జరిగింది. రుతుపవనాల ఆగమనానికి ముందు బంగాళాఖాతంలో మోరా తుఫాను ఏర్పడింది. ఆ ఏడాదిలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది.