దేశంలో ఎండలు మండుతున్నాయి. మూడు రోజుల కిందట ఢిల్లీలో 52.9 డిగ్రీల ఉష్టోగ్రతలు నమోదైన విషయం తెలిసిందే. తాజాగా నాగపూర్ ఆ రికార్డులను బద్దలు కొట్టింది. శుక్రవారంనాడు నాగపూర్‌లో 56 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మహారాష్ట్రలోని నాగపూర్‌లో వాతావరణ శాఖ నాలుగు ఆటోమెటెడ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. వాటిల్లో ఇవాళ 52 నుంచి 56 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఢిల్లీలో ఎన్నడూ లేని విధంగా 52.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంపై ఐఎండీ అధికారులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది నిజమా? లేదంటే కేంద్రంలో పరికరాలు సరిగా పనిచేయడం లేదా? అనే అనుమానాలు వస్తున్నాయి. ఢిల్లీ కేంద్రంలో పరికరాల పనితీరును పరిశీలిస్తున్నారు. నాగపూర్‌లో నమోదైన 56 డిగ్రీల ఉష్ణోగ్రతలపై కూడా అనుమానాలు రేకెత్తుతున్నాయి.