బ్రిటన్‌లోని బ్యాంక్ ఆఫ్ లండన్‌లో భారత్ నిల్వ చేసిన బంగారంలో లక్ష కిలోలను రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబైకి తరలించింది. భారత్ వద్ద మొత్తం 822 టన్నుల బంగారం ఉంది. ఆర్బీఐ ఏటా బంగారం కొనుగోళ్లు పెంచుకుంటూ వస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో కొనుగోలు చేసిన బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ లండన్‌లో నిల్వ చేస్తోంది. అందుకు ఏటా కొంత రుసుము చెల్లిస్తోంది.
తాజాగా రిజర్వు బ్యాంకు 100 టన్నుల బంగారాన్ని ముంబైకి తరలించింది. గత నాలుగు నెలలుగా వివిధ శాఖలతో సమన్వయం చేసుకుని ప్రత్యేక విమానంలో భారీ భద్రత మధ్య 100 టన్నుల బంగారం ముంబైకి చేర్చారు. ముంబై, నాగపూర్ మింట్‌లో ఈ బంగారం నిల్వ చేస్తారు. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం ఈ బంగారం విలువ రూ.7450 కోట్లు.బంగారం భారత్‌కు తరలించడం ద్వారా రిజర్వు బ్యాంకు ఏటా బ్యాంక్ ఆఫ్ లండన్‌కు చెల్లించే రుసుములు ఇక నుంచి చెల్లించాల్సిన అవసరం లేదు.