విజయవాడలో డయేరియా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి.కలుషిత నీటి కారణంగా అస్వస్థతకు గురవుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
కలుషిత నీరు పైప్లైన్లలో కలుస్తున్నా తగిన చర్యలు తీసుకోవడం లేదని విజయవాడ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం నుంచి అందాల్సిన వైద్య సాయం అందడం లేదని చెబుతున్నారు.
ప్రకాశం బ్యారేజీ దగ్గర కేవలం ఏడు అడుగుల లోతుకు నీటిమట్టం చేరింది. దీంతో ఇంటేక్ వెల్లోకి బురద చేరుతోంది.డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో ఇంటింటి సర్వే పేరుతో రక్తనమూనాలను సేకరిస్తున్నారు. నీటి నమూనాల పరీక్షలు ఫలితాల కోసం వేచి చూస్తున్నారు. నీటిలో నైట్రేట్ లు అధికంగా ఉండటమే కారణం కావచ్చని ప్రాథమిక అంచనా వేస్తున్నారు.