సార్వత్రిక ఎన్నికల ప్రచార అంకం ముగియడంతో పలువరు రాజకీయ నేతలు తీర్థయాత్రలు చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ , కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద ధ్యానం చేస్తున్నారు.
తాజాగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సైతం ప్రముఖ దైవక్షేత్రం తిరుమలకు వెళ్లారు. సతీమణితో కలిసి అమిత్ షా గురువారం సాయంత్రం తిరుమల చేరుకున్నారు. రాత్రి అక్కడే బస చేసి శుక్రవారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో కలియుగదైవం శ్రీవేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు.
అమిత్ షా దంపతులకు టీటీడీ సిబ్బంది, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేశారు.