పలువురు మహిళలపై లైంగికదాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను బెంగళూరు పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన వెంటనే సిట్ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం భారీ భద్రత మధ్య విచారణ కోసం సీఐడీ ఆఫీసుకు తరలించారు.వీడియోలు వైరల్ కాగానే ఆయన జర్మనీకి పారిపోయారు.
మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు అయిన ప్రజ్వల్ రేవణ్ణ.. ఎన్డీయే కూటమి తరఫున హాసన లోక్ సభ స్థానం నుంచి పోటీలో ఉన్నారు. అయితే ఆయన పలువురు మహిళలపై లైంగిక దాడి చేసినట్లు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దీంతో రేవణ్ణ దేశం విడిచి వెళ్ళారు. కేసు నమోదు చేసిన బెంగళూరు పోలీసులు అరెస్టు వారెంట్ జారీ చేశారు.
మరోవైపు బెంగళూరు కోర్టులో రేవణ్ణకు చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ పిటిషన్ను ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు తిరస్కరించింది.