గాజాపై కాల్పులు ఆపితే సంధికి సిద్ధమని పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ ప్రకటించింది. దాడులు ఆపేవరకు చర్చలకు కూడా అవకాశం లేదని ఉగ్ర సంస్థ తేల్చి చెప్పింది. అమెరికా, ఈజిప్ట్,ఖతార్ దేశాలు హమాస్, ఇజ్రాయెల్ మధ్య జరుపుతున్న చర్చలకు తెరపడింది. పూర్తిగా కాల్పుల విరమణ ప్రకటిస్తేనే సంధికి వస్తామంటూ గురువారం నాడు హమాస్ ఉగ్రవాదులు తేల్చి చెప్పారు.
హమాస్, ఇజ్రాయెల్ మధ్య సంధి ప్రయత్నాలు ఫలించలేదు. గత ఏడాది అక్టోబర్ 27న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై మెరుపుదాడులు చేసిన తరవాత ఇప్పటి వరకు 37 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. పూర్తిగా ఉగ్రవాదులను మట్టుబెట్టే వరకు యుద్ధం ఆపేది లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు తేల్చి చెప్పారు. ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ న్యాయస్థానం యుద్ధం ఆపాలని హెచ్చరించినా ఇజ్రాయెల్ లెక్కచేయడం లేదు. ఆయుధాల సరఫరా ఆపేస్తామని అమెరికా హెచ్చరించినా ఇజ్రాయెల్ యుద్ధం మాత్రం ఆపేది లేదని తేల్చి చెప్పింది.